![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -490 లో.. మురారి, ముకుంద మాట్లాడుకుంటారు. కృష్ణ నిన్ను నమ్మడం జరగదు. నన్ను అనుమానించడం జరగదని మురారి అనగానే.. జరిగింది. కావాలి అంటే రేపు తను ఐ హేట్ యూ ఏసీపీ సర్ అనే వాయిస్ కూడా రికార్డ్ చేసుకొని తీసుకొని వస్తానని ముకుంద అంటుంది. ఆపు ముకుంద. అయినా నాకు నువ్వు ఇష్టం లేదు అని చెప్తున్నా ఎందుకు నన్ను పట్టుకొని పీడిస్తున్నావని మురారి అనగానే.. ఎందుకు అంటే ఎప్పటికైనా నీ మనసు మారుతుందని అని ముకుంద అనగానే.. అది ఎప్పటికి జరగదని మురారి అంటాడు.
ఇంతలో కృష్ణ, మధులు ముకుందని ఫాలో అయిన మురారి ఉన్న ప్లేస్‌కి వస్తారు. మురారి పరిస్థితి చూసి షాక్ అవుతారు. ముకుంద కూడా కృష్ణ వాళ్లని చూసి భయపడుతుంది. మురారి హ్యాపీగా ఫీలవుతాడు. ఏసీపీ సర్ అనుకుంటు కృష్ణ వెళ్లి మురారి పరిస్థితికి ఏడుస్తుంది. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి అని ముకుంద అడగటంతో.. ముకుంద చెంప పగలగొడుతుంది కృష్ణ. ఏం చేశావే ఏసీపీ సర్ ని అని గొంతు పట్టుకుంటుంది. ఇదంతా తనే చేసిందని చెప్పండి ఏసీపీ సర్ దీన్ని ఇక్కడే చంపేస్తానని కృష్ణ అంటుంది. నాకు యాక్సిడెంట్ అయితే ఈ మీరానే ఇక్కడికి తీసుకొచ్చిందని మురారి అనగానే మీరా కాదు ఏసీపీ సర్ ముకుంద అని కృష్ణ అంటుంది. నీకు ఎప్పుడు తెలిసిందని మురారి అడుగగా.. మీ కంటే ముందే ఏసీపీ సర్. కానీ మీతో చెప్తే మన బిడ్డను చంపేస్తానని బెదిరిస్తే చెప్పలేదు. ఇది మన బిడ్డను అడ్డం పెట్టుకొని చేసిన అన్యాయాలు ఇన్నీ అన్నీ కావని కృష్ణ అంటుంది. ఇక ముకుంద, కృష్ణ ల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. ఇక భవానికి మధు విషయం చెప్తానంటే కృష్ణ వద్దనేస్తుంది. మురారిని హాస్పిటల్‌కి తీసుకెళ్దామని అంటుంది. ముకుంద ఒప్పుకోనంటే మధు సీరియస్ అవుతాడు. బిడ్డను అడ్డం పెట్టుకొని బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను మురారి, కృష్ణ కాదని అంటాడు. నువ్వు ఎలాంటి ఆడదానికి అయిన ఆదర్శ్ తాళి కట్టిన భార్యవి అని వరసకు వదిన అవుతావని మాటలతో చెప్పానని.. అడ్డు తప్పుకోకపోతే చేతలతో చెప్పాల్సి వస్తుందని అంటాడు. కాసేపటికి కృష్ణ, మధు కలిసి మురారిని హాస్పిటల్ కి తీసుకెళ్తారు.
మరోవైపు డాక్టర్ వైదేహి దగ్గరకి భవాని వెళ్ళి నిలదీయగా.. మీరా తన ఫ్రెండ్ అని అందుకే సరోగసి చేశానని చెప్తుంది. ఇక మధు, కృష్ణ ఇంటికి వస్తారు. మురారి గురించి ఏమైనా తెలిసిందా అని రేవతి అడుగుతుంది. చెప్తానంటూ నవ్వుతున్న కృష్ణ.. ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతుంది. మధు డాక్టర్‌కి కాల్ చేస్తాడు. ఇక భవాని చూసి కంగారుపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |